వాట్సాప్‌లో మీ-సేవ సేవలు ప్రారంభం! ఇకపై ఎస్‌ఎస్‌సి, ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సప్ లో

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పౌరులకు కీలకమైన మీ-సేవ సేవలను వాట్సాప్‌లో ప్రారంభించారు. మెటా భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఇతర పోటీ పరీక్షల హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.
ఈ సేవ 24 గంటలు 8096958096 నంబర్‌పై అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఈ సేవలను తెలుగు, ఉర్దూ భాషల్లోనూ, వాయిస్ కమాండ్‌తోనూ విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఏటా 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact