జమ్మికుంట: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట వ్యవసాయ కాటన్ మార్కెట్ యార్డ్ (ఏఎంసీ)లో కరీంనగర్ జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
జమ్మికుంట ఏఎంసీ చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, గ్రేడ్ వన్ సెక్రటరీ ఆర్. మల్లేశం, గ్రేడ్ టు రాజ మరియు సిబ్బంది, సెంటర్ ఇంచార్జీ ఎగిత అశోక్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం మాట్లాడుతూ… రైతులు తమ పంటను దళారులకు విక్రయించకుండా, నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని, క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధర పొందవచ్చని తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.







