జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్లను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జమ్మికుంటకు చెందిన బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ బోరబండ బస్తీ వాసులతో సమావేశమై, బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిపేట శివాజీ, కుమ్మరి శంకర్, ప్రవీణ్ భాగిడి, పట్టణ కార్యదర్శి ఠాకూర్ రాకేష్, రవిచంద్ర రెడ్డి, పట్టణ అధ్యక్షులు శనిగరపు రవి, గాజుల రాకేష్ సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







