కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు.
* సంస్థ: కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ (KALYAN JEWELLERS INDIA LTD).
* ఖాళీలు: సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీ, ఫ్లోర్ హోస్టెస్, సూపర్‌వైజర్, ఆఫీస్ బాయ్ వంటి 60 పోస్టులు ఉన్నాయి.
* అర్హత: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అనుభవం ఉన్న పురుషులు (Male) మరియు మహిళా (Female) అభ్యర్థులు అర్హులు.
* వయోపరిమితి: 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
* వేతనం: నెలకు ₹20,000 నుంచి ప్రారంభమవుతుంది.
* తేదీ, సమయం, వేదిక: ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 18న ఉదయం 11:00 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్ వెనుక ఉన్న కళ్యాణ్ జ్యువెలరీ షోరూమ్‌లో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
మరిన్ని వివరాలకు 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించవచ్చు.







