జమ్మికుంట: అక్టోబరు 13, 2025 న విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి రమేష్ (తండ్రి: సాయిలు) జమ్మికుంటలో పోగొట్టుకున్న ఒప్పో మొబైల్‌ను పోలీసులు తిరిగి అందించారు.
టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో, మొబైల్‌ను ఐఎంఈఐ నంబర్ ద్వారా సీఈఐఆర్ పోర్టల్ (CEIR PORTAL) సహాయంతో గుర్తించారు. మొబైల్ పోగొట్టుకున్నవారు వెంటనే ఈ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఇన్స్పెక్టర్ రామకృష్ణ సూచించారు.







