హరీష్ రావు తండ్రికి జమ్మికుంట బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి

సత్యనారాయణ రావుకు ప్రముఖుల నివాళి
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి కీ.శే. తన్నీరు సత్యనారాయణ రావు ఉదయం మరణించారు. హైదరాబాద్‌లో వారి అంతిమయాత్రలో జమ్మికుంట ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.
జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, బీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, ఇరుముల్ల సురేందర్ రెడ్డి, తోట లక్ష్మణ్, బొద్దుల రవీందర్, సమ్మారావు, మొలుగు పూర్ణ చందర్, పర్లపల్లి రమేష్ తదితరులు పాల్గొని తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact