జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 244 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. మొత్తం 33 వాహనాల్లో రైతులు సరుకును మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పత్తి క్వింటాలుకు గరిష్ట ధర రూ. 7,400, మోడల్ ధర రూ. 7,250, కనిష్ట ధర రూ. 7,000 పలికింది.
కాగా, కాటన్ బ్యాగుల విభాగంలో ఎలాంటి సరుకు రాక పోవడంతో అమ్మకాలు జరగలేదని మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెచ్చేటప్పుడు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.







