ఇల్లందకుంట: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలు అని నాయకులు కొనియాడారు. రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, బంగ్లాదేశ్ విమోచన వంటి సంస్కరణలతో ఆమె ప్రజాదరణ పొందారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.







