జమ్మికుంట (హుజూరాబాద్), అక్టోబర్ 13, 2025:
మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేస్తున్న కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులపై బీజేపీ నేతలు ఈరోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గత మూడు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ నాయకులు కొమ్ము అశోక్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు.
స్థానిక శాసనసభ్యులు ఎన్నికల సమయంలో హుజూరాబాద్‌కు రూ. 1000 కోట్ల నిధులు ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు పిచ్చి ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేకు ‘రీల్స్ వీడియోల’పై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్. శ్రీరామ్ శ్యామ్, బోయిని నారాయణ, మహేష్, వెంకటేష్, సతీష్ మోటార్ సంపత్ సహా ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.







