జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన రాసపల్లి శ్రావణ్‌కుమార్ ప్రమాదవశాత్తూ మైనింగ్ యాక్సిడెంట్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్మారకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సోమవారం రాచపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన అనాధాశ్రమం లోని పిల్లలకు బ్రెడ్, అరటిపండ్లు, కారా వంటి ఆహారపదార్థాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “శ్రావణ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన స్మృతిని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల రూపంలో నిలబెట్టుకోవాలని మా సంకల్పం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాసపల్లి రమేష్ కుమార్, రాసపల్లి సదానందం, రాసపల్లి రాజా, మొగిలి, పూలల నరేష్, కొత్తూరి అభి తదితరులు పాల్గొన్నారు.







