జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘంలో 72వ సహకార సంఘాల వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుండి 20 వరకు జరిగే ఈ వారోత్సవాలలో భాగంగా సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







