టేకుర్తి: తెలంగాణ మోడల్ స్కూల్ టేకుర్తిలో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్, SSC మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 మందికి పరీక్షా ప్యాడ్‌లను పంపిణీ చేశారు.
పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్ తన తల్లి మధురమ్మ పేరుమీద ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పి. తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ పంపిణీకి ఉపాధ్యాయులు అప్పల అశోక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







