ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తారని, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారని తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మార్గదర్శకత్వంలో, రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వంటి కీలక నిర్ణయాలలో ముఖ్యమంత్రి పాత్ర గొప్పదని ప్రశంసించారు. తెలంగాణ సమాజం ముఖ్యమంత్రికి అండగా నిలబడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగ్లీ రామారావు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడెం సారంగపాణి, కనుమల్ల సంపత్, ఎక్కేటి సంజీవరెడ్డి, పెద్ది శివకుమార్, దేవస్థానం ధర్మకర్తలు మరియు అనేకమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







