జమ్మికుంట, అక్టోబర్ 11, 2025:
బీఆర్‌ఎస్‌వీ యూత్ నాయకులు జవ్వాజి కుమార్ (JK) మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల బీసీ రిజర్వేషన్లపై ‘మొసలి కన్నీరు’ కారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ‘నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా’ అనే డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.
ఈటల బీసీ ముసుగులో ఉన్న దొర అని కుమార్ ధ్వజమెత్తారు. “బీసీల పేరు చెప్పుకుని వేల కోట్లు సంపాదించారు. రెండు ఎకరాల నుండి వేల ఎకరాలు ఎలా వచ్చాయో, రెండు గుంటల ఇంటి నుంచి ఐదెకరాల గడి ఎలా కట్టారో సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ఈటల కుటుంబ వివాహాల గురించి ప్రశ్నిస్తూ, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును ఆమోదింపజేయాలని సవాలు చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా ఈటలను ఓడించి తీరుతామని కుమార్ శపథం చేశారు.







