హైదరాబాద్/ జమ్మికుంట: ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రక్షణ చట్టాలు కల్పించాలని బీసీ ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనకై బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. స్థానిక సంస్థల్లో ఉపవర్గీకరణతో రిజర్వేషన్, బడ్జెట్ల తక్షణ విడుదల, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం నియామకం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.







