16 అక్టోబర్ 2025
జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ ఇమ్రాన్ ఆదేశాల మేరకు, జమ్మికుంటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీపీఆర్ (CPR) మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని 108 ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఐలావెని కుమారస్వామి, అమిరిశెట్టి బద్రీనాథ్, మరియు పైలెట్లు సిహెచ్. సంపత్ రెడ్డి, బి. రమేష్ నిర్వహించారు. విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించే విధానం, ముఖ్యంగా సీపీఆర్ పద్ధతిని వివరించారు. అలాగే, వర్షాకాలంలో మరియు వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలియజేశారు.
ఈ అవగాహన సదస్సులో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 108 సిబ్బంది సేవలను ప్రిన్సిపాల్ అభినందించారు.







