జమ్మికుంట మండలం తనుగుల క్రాస్ వద్ద జరిగిన ఆటో ట్రాలీ బోల్తా ఘటనలో గాయపడిన ఎల్భాక గ్రామస్థులను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పరామర్శించారు. జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన కలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లను కోరారు.







