జమ్మికుంట: ప్రసిద్ధ వాగ్గేయకారుడు, లోక కవి అందెశ్రీ అంతిమయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని నివాళులు అర్పించారు. అందెశ్రీ మరణం కళా, సాహిత్య రంగాలకు తీరని లోటు అని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిన అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, జనజాగృతి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ బోయిని సమ్మన్న, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర నాయకులు బోయిని రాజశేఖర్, పొన్నాల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







