ఖాజీపేట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు)కు సామాజిక సేవా రంగంలో తమిళనాడులోని ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా ‘నిత్య జనగణమన’ రూపకర్త, ఖాజిపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ప్రభును శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా పింగళి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభాకర్ నిస్వార్థంగా దశాబ్ద కాలంగా సమాజ సేవ చేస్తున్నాడని, ఆయన ‘కైండ్ హార్టెడ్ పర్సన్’ అని అభివర్ణించారు. సీనియర్ జర్నలిస్టులు యం.డి నసీరుద్దీన్, అన్వర్, ముస్తఫా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








