కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించనుంది. ఈ ఉద్యోగ మేళా డిసెంబర్ 27, 2025న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ మెగా జాబ్ ఫెయిర్ శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్ రోడ్, చింతకుంట, కరీంనగర్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వీటి ద్వారా 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఉద్యోగ మేళాలో ఐటీ/ఐటీఈఎస్, కోర్ ఇంజినీరింగ్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, మేనేజ్‌మెంట్ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి.
అర్హతలు:
బీ.టెక్, ఎం.టెక్, అన్ని డిగ్రీలు, పీజీ, ఫార్మా మరియు నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు, 2020 నుండి 2026 మధ్యలో చదువు పూర్తి చేసినవారు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనవచ్చు.
ఈ ఉద్యోగ మేళాకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటనలో ఇచ్చిన QR కోడ్ ను స్కాన్ చేసి నమోదు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం +91 81212 12873 నంబర్‌ను సంప్రదించవచ్చు.
ఈ మెగా జాబ్ ఫెయిర్ ద్వారా నిరుద్యోగ యువతకు, తాజా గ్రాడ్యుయేట్లకు మరియు అనుభవం ఉన్న అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని నిర్వాహకులు తెలిపారు.







