నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన
తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు శనివారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల కోసం ఇప్పటికే 12,303 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించి, స్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వీరు శనివారం నుంచి జరగనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావొచ్చని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసేదాకా (ఈ నెల 24 వరకు) వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact