జమ్మికుంట పురపాలక సంఘం నూతన చైర్మన్ గా శీలం శ్రీనివాస్

తేదీ 11-02-2019 మనజమ్మికుంట న్యూస్:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టిన తర్వాత

sheelam Srinivas jammikunta
Sheelam Srinivas as new Jammikunta Municipality Chairman

గత నాలుగు నెలలుగా ఉత్కంఠగా ఎదురు చూసిన నూతన చైర్మన్ ఈరోజు ఏకగ్రీవంగా ముగిసింది.
గత పురపాలక సంఘం ఛైర్మన్ పై సెప్టెంబర్ 18 న అవిశ్వాసం పెట్టిన 19 కౌన్సిలర్లు.
నేడు హుజురాబాద్ ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నిక జరిగింది.
ఆర్డీవో చెన్నయ్య మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినప్పటికీ ఒక్క శీలం శ్రీనివాస్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఈరోజు తనని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగిందని ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా 20 మంది కౌన్సిలర్ల కు గాను 18 మంది ఓటు వినియోగించుకోవడం జరిగింది.
కొత్తగా చైర్మన్ పదవిని చేపట్టబోతున్న శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన మాజీ మంత్రివర్యులు, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి, కౌన్సిలర్ల కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా తనకు మద్దతు పలికిన ఇతర పార్టీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈటెల రాజేందర్  సహాయంతో జమ్మికుంటలో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని తెలిపారు..

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact