జమ్మికుంట: మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవంబర్ 10, సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన 26 మంది విద్యార్థులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎమ్మార్వో, స్థానిక ఎంఈఓలతో కలిసి విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన లోపాలను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, […]
జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]
జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం […]
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, దేసిని కోటి ఆధ్వర్యంలో ప్రచారం ఉధృతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దొంత రమేష్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, బొంగోని వీరన్న, మర్రి రామ్ రెడ్డి, పంజాల అజయ్, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటమ్ ఝాన్సీ రవీందర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తారని, […]
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, పాలకవర్గం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడర్స్, ఆర్థిదారులు, రైతులు, హమాలీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్లను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జమ్మికుంటకు చెందిన బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ బోరబండ బస్తీ వాసులతో సమావేశమై, బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర […]
ఇల్లందకుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్‌తో కరీంనగర్ జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా నిరసన చేసే అవకాశం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఇల్లంతకుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి జంపాల రితీష్ సహా ఉపాధ్యక్షులు తోడేటి మధుకర్ గౌడ్, కారింగుల రాజేందర్, కోశాధికారి చింతల కౌశిక్, మురహరి రాజు, మేకల తిరుపతి, నల్లగొండ రాజు, […]
మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రేపు (నవంబర్ 06, 2025) హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11:00 గంటలకు, కమలాపూర్ మండల కేంద్రంలోని రావిచెట్టు వద్ద (ఈటల నివాసం సమీపంలో) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటు చేసిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వివరాలను ఎంపీ ఈటల రాజేందర్ పి.ఎ. నరేందర్ తెలిపారు.
జమ్మికుంట: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది నుతాల శ్రీనివాస్‌ను బీజేపీ నాయకులు జమ్మికుంటలోని ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడారు. న్యాయ వృత్తిలో పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మంచి పేరు శ్రీనివాస్‌కు ఉందని కొనియాడారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో పనిచేసి, బీజేపీ పటిష్టతకు కూడా […]