హైదరాబాద్ – రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ముఖ్యమైన తేదీలు ఓటర్ల వివరాలు ఈ ఎన్నికల్లో మొత్తంగా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.కొందరు నాయకులు మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తులకు ఇళ్లతో సంబంధం లేకుండా నెంబర్లు కేటాయించి, దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు తక్షణమే సమగ్ర […]
వీణవంక: స్థానిక సంస్థల ఎన్నికల వేళ హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీణవంక మండలం కిష్ణంపేటకు చెందిన సీనియర్ నాయకుడు సిద్ధపల్లి మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని మహిపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన […]
నవంబర్ 25, 2025: తెలంగాణలో స్థానిక సమరానికి తెరలేచింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల షెడ్యూల్ వివరాలువిడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల పోలింగ్ మరియు నామినేషన్ల ప్రక్రియ ఈ కింది విధంగా ఉండనుంది: మొదటి విడత: ఈ విడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి ప్రారంభం కానుండగా, డిసెంబర్ […]
జమ్మికుంట: మండలంలో రాబోయే 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ రిజర్వేషన్ల ప్రతిపాదిత జాబితాను అధికారులు విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మొత్తం 20 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రిజర్వేషన్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.ముఖ్య అంశాలు:ఎస్సీ (SC) రిజర్వేషన్లు: నగురం, నాగంపేట, మాచన్నపల్లి గ్రామాలను ఎస్సీ (జనరల్/మహిళ) కు కేటాయించగా; శంభునిపల్లి, మడిపల్లి గ్రామాలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. బీసీ (BC) రిజర్వేషన్లు: పాపయ్యపల్లి, […]
జమ్మికుంట, నవంబర్ 22: కార్మిక హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్ ల అమలు నోటిఫికేషన్ ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. శనివారం జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల అనంతరం కార్మికులపై భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని […]
జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి […]
ఇల్లందకుంట: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలు అని నాయకులు కొనియాడారు. రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, బంగ్లాదేశ్ విమోచన వంటి సంస్కరణలతో ఆమె ప్రజాదరణ పొందారు. ఆమె జీవితం నేటి […]
జమ్మికుంట: బీసీ హక్కులు బీసీలకే దక్కాలి, బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో రేపు (నవంబర్ 20, బుధవారం) ఇందిరానగర్ లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మద్దతుగా, దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుల్జార్ మస్జిద్ (జామ మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.మహమ్మద్ బందే […]
జమ్మికుంట: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతుల రద్దుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట CITU మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం జమ్మికుంట పట్టణంలో ప్రత్యేక అడ్డా స్థలం కేటాయించాలని, అక్కడ మంచినీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ బోర్డు […]