News

Nov 11
విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి: యూత్ కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట: పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలను యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంఈఓ అధికారులకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసి, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపవద్దని అన్నారు. ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ చర్యలు తప్పవని […]

Nov 11
అందెశ్రీకి కళాకారుల అంతిమ వీడ్కోలు

జమ్మికుంట: ప్రసిద్ధ వాగ్గేయకారుడు, లోక కవి అందెశ్రీ అంతిమయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని నివాళులు అర్పించారు. అందెశ్రీ మరణం కళా, సాహిత్య రంగాలకు తీరని లోటు అని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిన అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, జనజాగృతి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కెర […]

Nov 11
జమ్మికుంటలో దొంత రమేష్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలను మంగళవారం జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దేశిని కోటి మాట్లాడుతూ, యువ నాయకుడైన దొంత రమేష్ ఎంతో మంది పేదలకు సహాయం చేశారని, రానున్న రోజుల్లో ఆయనకు మంచి ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ […]

Nov 11
విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు: ఏఐఎస్ఎఫ్

జమ్మికుంట మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.జమ్మికుంట బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గురుకుల పాఠశాలలకు, శిథిలావస్థలో […]

Nov 11
గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రభు, డాక్టర్ సీటు సాధించిన అక్షిత
జమ్మికుంట

మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) సామాజిక సేవకు గుర్తింపుగా ఇటీవల తమిళనాడులోని హోసూర్ నగరంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా, ఆయన కూతురు అంబాల అక్షిత 2024-25 విద్యా సంవత్సరంలో నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించారు.ఈ సందర్భంగా, మడిపల్లి నర్తన డప్పు కళా బృందం కళాకారులు మంగళవారం జమ్మికుంట న్యూ జర్నలిస్ట్ కాలనీలోని వారి నివాసంలో తండ్రి, కూతుళ్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు సమాజ సేవతో పాటు చిత్రకారునిగా, […]

Nov 11
జమ్మికుంట పాఠశాల ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట: మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవంబర్ 10, సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన 26 మంది విద్యార్థులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎమ్మార్వో, స్థానిక ఎంఈఓలతో కలిసి విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన లోపాలను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, […]

Nov 11
జమ్మికుంట మైనారిటీ స్కూల్లో ఘనంగా మైనారిటీ వెల్ఫేర్ డే

జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద […]

Nov 10
రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి

జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]

Nov 08
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభం

జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం […]

Nov 08
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో దేశిని కోటి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, దేసిని కోటి ఆధ్వర్యంలో ప్రచారం ఉధృతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దొంత రమేష్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, బొంగోని వీరన్న, మర్రి రామ్ రెడ్డి, పంజాల అజయ్, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటమ్ ఝాన్సీ రవీందర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Listings News Offers Jobs Contact