వావిలాల: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ వరుణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో 43 మంది వృద్ధులకు రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మాట్లాడుతూ, వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నడక, ధ్యానం, ఉదయపు ఎండలో గడపడం వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. […]
జమ్మికుంట: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతుల రద్దుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట CITU మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం జమ్మికుంట పట్టణంలో ప్రత్యేక అడ్డా స్థలం కేటాయించాలని, అక్కడ మంచినీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ బోర్డు […]
జమ్మికుంట: ఆధునిక కాలంలో రైతులకు డ్రోన్ స్ప్రే పై అవగాహన కల్పించి,వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని డ్రోన్ స్ప్రే నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డ్రోన్ స్ప్రే వలన కలిగే లాభాలు,రైతుకు ఏ విధంగా వీటి వాడకం వల్ల ఉపయోగం కలుగుతుందో తెలియజేయాలని నిర్వహుకుణ్ణి కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని,ఇలాంటి ఆధునిక యంత్రాలతో రైతులకు మరింత లాభసాటిగా చేయాలని […]
జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, జమ్మికుంటలో ఖాళీగా ఉన్న M.Sc. జువాలజీ మరియు M.Sc. బోటనీ కోర్సుల్లో ప్రవేశం కోసం స్పాట్ అడ్మీషన్లు నిర్వహించనున్నారు.ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుదారులు CPGET – 2025లో అర్హత పొంది ఉండాలి లేదా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి […]
జమ్మికుంట మండలం తనుగుల క్రాస్ వద్ద జరిగిన ఆటో ట్రాలీ బోల్తా ఘటనలో గాయపడిన ఎల్భాక గ్రామస్థులను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పరామర్శించారు. జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన కలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లను కోరారు.
జమ్మికుంట: హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ శనివారం జమ్మికుంట మండలంలోని 8 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేసింది.ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 227 మందికి, ఇంటర్మీడియట్ చదువుతున్న 160 మందికి కలిపి మొత్తం 387 పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జరిగింది. ఈ […]
జమ్మికుంట: మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ‘బీసీల హక్కులు బీసీలకు దక్కాలి’ అనే నినాదంతో ఈ నెల 19న (బుధవారం) దినేష్ కన్వెన్షన్, జమ్మికుంటలో చైతన్య సదస్సు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ హక్కులను సాధించుకోవడంపై బీసీ సమాజం సంఘటితం కావాలని సదస్సు కోరింది.విద్య, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై […]
జమ్మికుంట: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్తరా నక్షత్ర లక్ష్మీ గణపతి హోమం తో పాటు, స్వామివారికి నవవిధ అభిషేకములు, రుద్రాభిషేకం జరిగాయి.అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి, అఖండ హారతి ఇచ్చారు. ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. వారికి బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ మాల మంత్రాలతో దీక్షను […]
జమ్మికుంట: బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి 243 స్థానాలకు గాను సుమారు 206 సీట్లలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం అనంతరం కొలకాని రాజు మాట్లాడుతూ, దొంగ ఓట్లంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని బీహార్ ప్రజలు ఓటుతో తిరస్కరించడం చెంపపెట్టు అని ఎద్దేవా […]
జమ్మికుంట: జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులు చిన్న ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో పాఠాలు బోధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అలరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మండల విద్యా అధికారి హేమలత గారు ఉపాధ్యాయులుగా […]