జమ్మికుంట, నవంబర్ 21: భూటాన్లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్ హ్యామర్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘును శనివారం (నవంబర్ 22) ఉదయం 7 గంటలకు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా సన్మానించనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం చెల్పూర్ గ్రామానికి చెందిన రఘు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్రీడాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ […]
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ బుధవారం నాడు పత్తి ధరలు. 351 క్వింటాళ్ల విడి పత్తి మార్కెట్‌కు రాగా, దాని గరిష్ట ధర క్వింటాలుకు ₹7,090, కనిష్ట ధర ₹6,000 గా ఉంది. కాటన్ బ్యాగ్‌ల గరిష్ట ధర ₹6,600. నవంబర్ 20, గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. తిరిగి నవంబర్ 21, శుక్రవారం మార్కెట్ తెరుచుకోనుంది.
జమ్మికుంట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక విస్డం జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అధ్యాపకులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా రావుల శరణ్య ప్రిన్సిపాల్‌గా, బొడ్డుపల్లి సందీప్ కుమార్ కరస్పాండెంట్ గా, కొత్తూరు సోనీ వైస్ ప్రిన్సిపాల్ గా, కుర్ర సిద్దు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ కే విజయేందర్ రెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు […]
జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి […]
ఇల్లందకుంట: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలు అని నాయకులు కొనియాడారు. రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, బంగ్లాదేశ్ విమోచన వంటి సంస్కరణలతో ఆమె ప్రజాదరణ పొందారు. ఆమె జీవితం నేటి […]
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పౌరులకు కీలకమైన మీ-సేవ సేవలను వాట్సాప్‌లో ప్రారంభించారు. మెటా భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఇతర పోటీ పరీక్షల హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.ఈ సేవ 24 గంటలు 8096958096 నంబర్‌పై అందుబాటులో ఉంటుంది. […]
జమ్మికుంట: బీసీ హక్కులు బీసీలకే దక్కాలి, బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో రేపు (నవంబర్ 20, బుధవారం) ఇందిరానగర్ లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మద్దతుగా, దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుల్జార్ మస్జిద్ (జామ మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.మహమ్మద్ బందే […]
కరీంనగర్: వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కరీంనగర్‌లోని ఓ బాంకెట్ హాల్‌లో జరిగిన WJI సర్వసభ్య సమావేశంలో ఈ నియామకాలు జరిగాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన బీఎంఎస్ (BMS) అనుబంధ సంఘంగా WJI గుర్తింపు పొందింది.ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు నర్సిని కేదారి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషినూతనంగా ఎన్నికైన నర్సిని కేదారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు […]
జమ్మికుంట: ప్రపంచ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా, జమ్మికుంటలోని అమృత న్యూరో హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కందికొండ రాజేందర్ (DM న్యూరాలజిస్ట్) మూర్ఛ వ్యాధి (Epilepsy) గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, సరైన చికిత్స ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు.డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, మూర్ఛ అనేది అన్ని వయసుల వారికీ రావొచ్చని, దీనికి కారణాలు కూడా పలు రకాలుగా ఉంటాయని వివరించారు. చిన్నపిల్లలలో అధిక జ్వరం, మెదడులో నిర్మాణ సంబంధిత సమస్యలు లేదా జన్యుపరమైన కారణాల వల్ల […]
జమ్మికుంట: బీసీల హక్కులు, రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కు అనే నినాదంతో ఈనెల 19న (బుధవారం) ఇందిరా నగర్‌లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సును రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల బీసీలు హాజరై విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శనిగరపు తిరుపతయ్య కోరారు.సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు […]