ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తారని, […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
తమ పనిమీద జమ్మికుంటలోని కాకతీయ డిజి స్కూల్ వద్ద వెళ్తున్న మాచనపల్లి గ్రామానికి చెందిన కనవేనా తిరుపతి (32), కనవేనా ప్రశాంత్ (27)లకు ఒక పుస్తెలతాడు కనిపించింది. వెంటనే వారు దానిని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ విచారించి, అది మల్యాలకు చెందిన నేరెళ్ల స్రవంతి (25)దిగా గుర్తించి ఆమెకు తిరిగి ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తిరుపతి, ప్రశాంత్‌లను ఇన్స్పెక్టర్ అభినందించారు.
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, పాలకవర్గం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడర్స్, ఆర్థిదారులు, రైతులు, హమాలీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్లను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జమ్మికుంటకు చెందిన బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ బోరబండ బస్తీ వాసులతో సమావేశమై, బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర […]
జమ్మికుంట: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అదృశ్యం కావడంతో కేసు నమోదైంది. మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల పోచయ్య అనే వ్యక్తి తన కూతురు అంబాల నిర్మల (భర్త రాజు, వయసు 32) కనిపించడం లేదంటూ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. 🔍 కేసు వివరాలుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 🚨 పోలీసుల స్పందనతండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.జమ్మికుంట CI రామకృష్ణ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మహిళ ఆచూకీ […]
ఇల్లందకుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్‌తో కరీంనగర్ జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా నిరసన చేసే అవకాశం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఇల్లంతకుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి జంపాల రితీష్ సహా ఉపాధ్యక్షులు తోడేటి మధుకర్ గౌడ్, కారింగుల రాజేందర్, కోశాధికారి చింతల కౌశిక్, మురహరి రాజు, మేకల తిరుపతి, నల్లగొండ రాజు, […]
మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రేపు (నవంబర్ 06, 2025) హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11:00 గంటలకు, కమలాపూర్ మండల కేంద్రంలోని రావిచెట్టు వద్ద (ఈటల నివాసం సమీపంలో) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటు చేసిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వివరాలను ఎంపీ ఈటల రాజేందర్ పి.ఎ. నరేందర్ తెలిపారు.
నవంబర్ 05, 2025జమ్మికుంట: ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి బస్తాలు కింద పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తక్షణమే స్పందించి సిబ్బందిని పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సతీష్ స్వయంగా వడ్ల బస్తాలను మోసి ట్రాక్టర్‌పై ఎక్కించి రైతుకు సహాయం చేశారు. ఆపదలో ఆదుకున్న పోలీసుల సేవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
నవంబర్ 05, 2025జమ్మికుంట: కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) ఆలయం భక్త సంద్రమైంది. భక్తులు స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ఉసిరి చెట్టుకు దీపాలు సమర్పించారు. అమ్మవారికి పౌర్ణమి పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా, అన్నపూర్ణ సేవా సమితి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.