మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) సామాజిక సేవకు గుర్తింపుగా ఇటీవల తమిళనాడులోని హోసూర్ నగరంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా, ఆయన కూతురు అంబాల అక్షిత 2024-25 విద్యా సంవత్సరంలో నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించారు.ఈ సందర్భంగా, మడిపల్లి నర్తన డప్పు కళా బృందం కళాకారులు మంగళవారం జమ్మికుంట న్యూ జర్నలిస్ట్ కాలనీలోని వారి నివాసంలో తండ్రి, కూతుళ్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు సమాజ సేవతో పాటు చిత్రకారునిగా, […]
జమ్మికుంట: మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవంబర్ 10, సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన 26 మంది విద్యార్థులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎమ్మార్వో, స్థానిక ఎంఈఓలతో కలిసి విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన లోపాలను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, […]
జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద […]
జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]
జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం […]
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, దేసిని కోటి ఆధ్వర్యంలో ప్రచారం ఉధృతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దొంత రమేష్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, బొంగోని వీరన్న, మర్రి రామ్ రెడ్డి, పంజాల అజయ్, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటమ్ ఝాన్సీ రవీందర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తారని, […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
తమ పనిమీద జమ్మికుంటలోని కాకతీయ డిజి స్కూల్ వద్ద వెళ్తున్న మాచనపల్లి గ్రామానికి చెందిన కనవేనా తిరుపతి (32), కనవేనా ప్రశాంత్ (27)లకు ఒక పుస్తెలతాడు కనిపించింది. వెంటనే వారు దానిని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ విచారించి, అది మల్యాలకు చెందిన నేరెళ్ల స్రవంతి (25)దిగా గుర్తించి ఆమెకు తిరిగి ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తిరుపతి, ప్రశాంత్‌లను ఇన్స్పెక్టర్ అభినందించారు.
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, పాలకవర్గం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడర్స్, ఆర్థిదారులు, రైతులు, హమాలీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.