Category: News

Oct 26
లెక్చరర్‌ డాక్టర్ వంగల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ: పూర్వ విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు ఆహ్వానం

జమ్మికుంట: ఇల్లందకుంట వాస్తవ్యులు, ఎందరో విద్యార్థుల జీవితాలకు బంగారు బాట వేసిన డాక్టర్ వంగల శ్రీనివాస్ గారు తన సుదీర్ఘమైన 42 సంవత్సరాల ఆరు నెలల పది రోజుల పాటు కొనసాగిన విద్యా సేవకు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వారు శ్రీనివాస్ కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 🎓 వంగల శ్రీనివాస్ విద్యా సేవడాక్టర్ శ్రీనివాస్ తమ ఉద్యోగ ప్రయాణాన్ని 1983, ఏప్రిల్ 22న ఎస్.జీ.టి.గా ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ హోదాలలో తమ సేవలను అందించారు: […]

Oct 26
ఉద్యోగావకాశాలు: వరంగల్‌లో ‘ఆర్.ఎస్. బ్రదర్స్’ లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు

ఆర్.ఎస్. బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ త్వరలో వరంగల్‌లో ప్రారంభం కానున్న తమ నూతన షోరూమ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తవారికి మరియు అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. 📝 ఖాళీగా ఉన్న పోస్టులుశారీస్, లేడీస్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, ఫ్యాన్సీమండీయం, ఫర్నిషింగ్ సెక్షన్లలో పనిచేయుటకు ఈ కింది ఉద్యోగులు కావలెను: * సూపర్‌వైజర్స్ * సేల్స్‌మెన్ / సేల్స్‌గర్ల్స్ * హెల్పర్స్ * కంప్యూటర్ బిల్ రైటర్స్ * ఆల్టరేషన్ టైలర్స్ * […]

Oct 25
జమ్మికుంట: మృతుని కుటుంబానికి కాకర్స్ యూనియన్ ఆర్థిక సహాయం

అక్టోబర్ 25, 2025: జమ్మికుంట పట్టణంలో ఇటీవల మరణించిన ఖమ్మం పాటీ శ్రీనివాస్ కుటుంబానికి దీపావళి కాకర్స్ యూనియన్ అండగా నిలిచింది. యూనియన్ అధ్యక్షులు బోళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో, సభ్యులు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి శివకుమార్, తడిగొప్పుల శ్రీనివాస్, గడ్డం దీక్షిత్, చొక్కారపు అఖిలేష్, దొడ్డే రమేష్, గుల్లి రఘు, దేవునూరి వినయ్ పాల్గొన్నారు.

Oct 25
పారిశ్రామికవేత్త ముక్కా జితేందర్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు!

జమ్మికుంట: ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్‌ అయిన ముక్కా జితేందర్ గుప్తా ఈరోజు (అక్టోబరు 25, 2025) తమ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, భక్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Oct 25
దళారులను నమ్మొద్దు: మడిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన వైస్ చైర్మన్

జమ్మికుంట: మడిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ప్రజా ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుందని తెలిపారు. నేరెళ్ల రాజమల్లు, ఎగ్గెటి సదానందం పాల్గొన్నారు.

Oct 24
జమ్మికుంట అయ్యప్ప దేవాలయంలో 25న లక్ష్మీ గణపతి హోమం

జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా రేపు (25-10-2025) శనివారం ఉదయం 7 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో సకాలంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరనీ అయ్యప్ప సేవా సమితి, జమ్మికుంట వారు ఒక ప్రకటనలో తెలిపారు.

Oct 24
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వార్తలు

జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో 24-10-2025, శుక్రవారం నాడు పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి.విడి పత్తి 1200 క్వింటాళ్ల రాగా, ధరలు క్వింటాలుకు ₹7,200 నుండి ₹6,100 వరకు పలికాయి. కాటన్ బ్యాగ్స్ 27 క్వింటాళ్లకు ₹6,600 నుండి ₹5,500 వరకు ధర లభించింది.మార్కెట్‌కు 25, 26 తేదీలలో (శని, ఆదివారం) సెలవు ప్రకటించారు. మార్కెట్ తిరిగి 27-10-2025, సోమవారం నాడు ప్రారంభమవుతుంది.

Oct 24
సీనియర్ జర్నలిస్ట్ ఏబూసి శ్రీనివాస్‌కు సన్మానం

జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవతెలంగాణ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను సన్మానించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ వర్క్‌షాప్ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిజిఎం ప్రభాకర్, నవతెలంగాణ ఎడిటర్ రమేష్ చేతుల మీదుగా ఆయన సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు, మిత్రులు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Oct 24
మైనారిటీలకు పథకాల దరఖాస్తు గడువు పెంచాలి

జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం దూదేకుల, నూర్ భాష మరియు ఫకీర్ కులాలకు మొపేడ్ వాహనాలు (ఎలక్ట్రిక్ టూ వీలర్లు), వితంతు/ఒంటరి మహిళలకు రూ.50,000/- అందించే పథకాలను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసింది. ఈ పథకాలకు చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. ఎన్నికలు వాయిదా పడినందున, దరఖాస్తు గడువును తిరిగి పొడిగించాలని మైనారిటీ సీనియర్ నాయకులు ఎం.డి గౌసోద్దీన్, ఎం.డి అంకూషా, యాకుబ్, సలీం తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకాలు పేద మైనారిటీల జీవనోపాధికి కీలకం.

Oct 24
బీసీలకు రక్షణ చట్టాలు కల్పించాలి: మహమ్మద్ యూసుఫ్

హైదరాబాద్/ జమ్మికుంట: ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రక్షణ చట్టాలు కల్పించాలని బీసీ ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనకై బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. స్థానిక సంస్థల్లో ఉపవర్గీకరణతో రిజర్వేషన్, బడ్జెట్ల తక్షణ విడుదల, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం నియామకం చేయాలని […]

Listings News Offers Jobs Contact