Category: Flash News

Sep 20
వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు

వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఈ రోజు స్థానిక శివాలయంలో (బొమ్మల గుడి) ప్రాంగణంలో రంగు రంగుల పూలతో అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ పాటలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sep 17
గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

తేదీ 17-09-2017 గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం జమ్మికుంట టౌన్: నిన్న జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, తాడ్వాయి మండలం, లవ్వాలా గ్రామ సమీపంలో నివసిస్తున్న 200 మంది దళిత గిరిజన కుటుంబాలపై అమానుషంగా దాడి చేసి చెట్టుకు కట్టేసి మహిళలను సైతం చూడకుండా చిత్రహింసలు చేశారని, ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం […]

Sep 15
జమ్మికుంట లో నిత్య జనగణమనకు ముప్పయి రోజులు

జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]

Sep 15
రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట లో RDO

రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట లో కరీంనగర్ జిల్లా RDO

Aug 24
జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్

తేదీ 22-08-2017జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్ నిర్వహించిన నగర పంచాయితీ చైర్మన్, సిబ్బంది మరియు టీఆర్ఎస్ నాయకులు

Aug 19
సర్వాయి పాపన్న 367 జయంతి ఉత్సవాలు

సర్వాయి పాపన్న 367 జయంతి ఉత్సవాలు ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల మీదుగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 200 బైకులతో ర్యాలి నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమం ఇల్లందకుంట మండల అధ్యక్షుడు అంబటి రమేష్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంనకు జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, సెక్రటరీ జనరల్  ముఖ్య అతిథులుగా అతిథులుగా పాల్గొన్నారు. 

Aug 19
మహానాడు ముఖ్యనాయకుల సమావేశం

ఎస్సీ వర్గీకరణ సమస్యను ఎమ్మార్పీఎస్ నాయకులు విడనాడాలని రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని తెలంగాణ మాల మహానాడు ముఖ్యనాయకుల సమావేశం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మాల మాదిగలు కలిసి కలిసి ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.  

Aug 19
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం

తేదీ 19-08-2017 ఈరోజు జమ్మికుంట మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి గార్డెన్స్ లో ప్రపంచ ఫోటోగ్రఫి  దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట ఎస్సై శ్రీనివాస్ రావడం జరిగింది.  ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొనగంటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు నాగేందర్, సురోజు శ్రీధర్, రాంబాబు, శంకర్ శివన్న, శ్రీనివాస్ తదితర ఫోటోగ్రాఫర్ పాల్గొన్నారు

Aug 19
మాస్టర్ జూనియర్ కళాశాలలో WELCOME PARTY

ఈరోజు స్థానిక ‘సువర్ణ ఫంక్షన్ హాల్’ లో ‘మాస్టర్ జూనియర్ కళాశాల’ వారి welcome party నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ మరియు ద్వితీయ సం. విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా senior విద్యార్థులు, ప్రథమ సం. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి, గతంలో మాస్టర్స్ విద్యార్థులు state rank సాదించి రాష్ట్ర  స్థాయిలో మాస్టర్స్ విజయకేతనం ఎగురవేసారాని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాన్దేట్, శ్రీ అబ్బిడి తిరుపతి రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ […]

Listings News Offers Jobs Videos