జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్లను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జమ్మికుంటకు చెందిన బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ బోరబండ బస్తీ వాసులతో సమావేశమై, బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర […]
జమ్మికుంట: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అదృశ్యం కావడంతో కేసు నమోదైంది. మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల పోచయ్య అనే వ్యక్తి తన కూతురు అంబాల నిర్మల (భర్త రాజు, వయసు 32) కనిపించడం లేదంటూ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. 🔍 కేసు వివరాలుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 🚨 పోలీసుల స్పందనతండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.జమ్మికుంట CI రామకృష్ణ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మహిళ ఆచూకీ […]
ఇల్లందకుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్‌తో కరీంనగర్ జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా నిరసన చేసే అవకాశం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఇల్లంతకుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి జంపాల రితీష్ సహా ఉపాధ్యక్షులు తోడేటి మధుకర్ గౌడ్, కారింగుల రాజేందర్, కోశాధికారి చింతల కౌశిక్, మురహరి రాజు, మేకల తిరుపతి, నల్లగొండ రాజు, […]
మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రేపు (నవంబర్ 06, 2025) హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11:00 గంటలకు, కమలాపూర్ మండల కేంద్రంలోని రావిచెట్టు వద్ద (ఈటల నివాసం సమీపంలో) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటు చేసిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వివరాలను ఎంపీ ఈటల రాజేందర్ పి.ఎ. నరేందర్ తెలిపారు.
నవంబర్ 05, 2025జమ్మికుంట: ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి బస్తాలు కింద పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తక్షణమే స్పందించి సిబ్బందిని పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సతీష్ స్వయంగా వడ్ల బస్తాలను మోసి ట్రాక్టర్‌పై ఎక్కించి రైతుకు సహాయం చేశారు. ఆపదలో ఆదుకున్న పోలీసుల సేవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
నవంబర్ 05, 2025జమ్మికుంట: కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) ఆలయం భక్త సంద్రమైంది. భక్తులు స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ఉసిరి చెట్టుకు దీపాలు సమర్పించారు. అమ్మవారికి పౌర్ణమి పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా, అన్నపూర్ణ సేవా సమితి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.
ఖాజీపేట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు)కు సామాజిక సేవా రంగంలో తమిళనాడులోని ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా ‘నిత్య జనగణమన’ రూపకర్త, ఖాజిపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ప్రభును శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పింగళి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభాకర్ నిస్వార్థంగా దశాబ్ద కాలంగా సమాజ సేవ చేస్తున్నాడని, ఆయన ‘కైండ్ హార్టెడ్ పర్సన్’ అని అభివర్ణించారు. సీనియర్ జర్నలిస్టులు యం.డి […]
జమ్మికుంట: స్వామి వివేకానంద పాఠశాల హాస్టల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని అధికారులను కోరినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై BRSV రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం కనీసం స్పందించకపోవడం, అధికార యంత్రాంగం మద్దతుగా నిలవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలు ధన దాహంతో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని విస్మరిస్తున్నాయని […]
జమ్మికుంట: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది నుతాల శ్రీనివాస్‌ను బీజేపీ నాయకులు జమ్మికుంటలోని ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడారు. న్యాయ వృత్తిలో పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మంచి పేరు శ్రీనివాస్‌కు ఉందని కొనియాడారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో పనిచేసి, బీజేపీ పటిష్టతకు కూడా […]
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పుట్టినరోజు వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం పాషా ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు భారీగా బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం, జమ్మికుంట శివాలయంలో మహా అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ […]