కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలను మంగళవారం జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దేశిని కోటి మాట్లాడుతూ, యువ నాయకుడైన దొంత రమేష్ ఎంతో మంది పేదలకు సహాయం చేశారని, రానున్న రోజుల్లో ఆయనకు మంచి ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ […]
ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తారని, […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, పాలకవర్గం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడర్స్, ఆర్థిదారులు, రైతులు, హమాలీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి సతీమణి శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారికి జన్మ దినం పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.