Tag: BC Reservation Bill

Nov 18
బీసీ రిజర్వేషన్ల సాధనకై ఇందిరానగర్‌లో రేపు భారీ సదస్సు: విజయవంతం చేయాలని బందే అలీ పిలుపు

జమ్మికుంట: బీసీ హక్కులు బీసీలకే దక్కాలి, బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో రేపు (నవంబర్ 20, బుధవారం) ఇందిరానగర్ లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మద్దతుగా, దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుల్జార్ మస్జిద్ (జామ మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.మహమ్మద్ బందే […]

Nov 17
ఈనెల 19న నిర్వహించే బీసీ సదస్సును విజయవంతం చేయాలి

జమ్మికుంట: బీసీల హక్కులు, రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కు అనే నినాదంతో ఈనెల 19న (బుధవారం) ఇందిరా నగర్‌లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సును రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల బీసీలు హాజరై విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శనిగరపు తిరుపతయ్య కోరారు.సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు […]

Nov 15
బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 19న జమ్మికుంటలో కీలక సదస్సు

జమ్మికుంట: మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ‘బీసీల హక్కులు బీసీలకు దక్కాలి’ అనే నినాదంతో ఈ నెల 19న (బుధవారం) దినేష్ కన్వెన్షన్, జమ్మికుంటలో చైతన్య సదస్సు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ హక్కులను సాధించుకోవడంపై బీసీ సమాజం సంఘటితం కావాలని సదస్సు కోరింది.విద్య, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై […]

Nov 07
గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్

ఇల్లందకుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్‌తో కరీంనగర్ జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా నిరసన చేసే అవకాశం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఇల్లంతకుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి జంపాల రితీష్ సహా ఉపాధ్యక్షులు తోడేటి మధుకర్ గౌడ్, కారింగుల రాజేందర్, కోశాధికారి చింతల కౌశిక్, మురహరి రాజు, మేకల తిరుపతి, నల్లగొండ రాజు, […]

Oct 24
బీసీలకు రక్షణ చట్టాలు కల్పించాలి: మహమ్మద్ యూసుఫ్

హైదరాబాద్/ జమ్మికుంట: ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రక్షణ చట్టాలు కల్పించాలని బీసీ ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనకై బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. స్థానిక సంస్థల్లో ఉపవర్గీకరణతో రిజర్వేషన్, బడ్జెట్ల తక్షణ విడుదల, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం నియామకం చేయాలని […]

Oct 19
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: బీసీ నాయకులు

జమ్మికుంట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. ఈ బంద్‌కు […]

Oct 18
బీసీలను మోసం చేస్తున్నది బీజేపీయే: సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్

జమ్మికుంట, అక్టోబర్ 18 (జమ్మికుంటలోకల్.కామ్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, బీసీలను మోసం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం సిగ్గుచేటని అన్నారు.42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కులగూడెం చౌరస్తా నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ […]

Oct 18
బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి: బీసీ సంఘాల జేఏసీ

2025 అక్టోబర్ 18ఇల్లందకుంట: బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ జరిగింది. ఈ బంద్‌లో బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఆర్‌పిఎస్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, గుండ్ల గణపతి, తిరుమల మాట్లాడుతూ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. […]

Listings News Offers Jobs Contact