జమ్మికుంట: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్తరా నక్షత్ర లక్ష్మీ గణపతి హోమం తో పాటు, స్వామివారికి నవవిధ అభిషేకములు, రుద్రాభిషేకం జరిగాయి.అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి, అఖండ హారతి ఇచ్చారు. ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. వారికి బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ మాల మంత్రాలతో దీక్షను […]
జమ్మికుంట: స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా ఈరోజు హోమం మరియు స్వామివారికి విశేషాలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ శ్రీధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప సేవ సమితి ఆకాంక్షించింది.
జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా రేపు (25-10-2025) శనివారం ఉదయం 7 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో సకాలంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరనీ అయ్యప్ప సేవా సమితి, జమ్మికుంట వారు ఒక ప్రకటనలో తెలిపారు.