Category: News

Nov 13
జమ్మికుంటలో అనధికార క్లినిక్ సీజ్

జమ్మికుంట: పట్టణంలోని ‘సెరా లైఫ్’ క్లినిక్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు గుర్తించి, వెంటనే మూసివేయాలని ఆదేశించారు. చట్టపరమైన రిజిస్ట్రేషన్ వచ్చేవరకు క్లినిక్ తెరవకూడదని నిర్వాహకుడికి సూచించారు. ప్రజలు అర్హత గల వైద్యుల వద్దే వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ తనిఖీలో సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.

Nov 13
నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి నాయకులు

వీణవంక మాజీ సింగిల్ విండో చైర్మన్ పెద్ది మల్లారెడ్డి కుమార్తె డా. సుప్రియ – డా. ఆదిత్య కిషోర్ వివాహం బుధవారం కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో జరిగింది. అలాగే, జమ్మికుంట మడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు పెరవేన రమేశ్ కుమారుడు అఖిల్ – దివ్యల వివాహం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్‌లో జరిగింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు […]

Nov 13
జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరల వివరాలు

జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం  (13-11-2025) పత్తి అమ్మకాలు కొనసాగాయి. * విడి పత్తి: 66 వాహనాల్లో 593 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ధర క్వింటాల్‌కు ₹7,000 నుండి ₹6,200 మధ్య పలికింది. * కాటన్ బ్యాగ్‌లు: 7 మంది రైతులు తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల ధర ₹6,200 నుండి ₹5,000 మధ్య నమోదైంది.

Nov 13
కరీంనగర్ ‘టాస్క్’లో రేపు జాబ్ డ్రైవ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో ఉన్న ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న (రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఈ డ్రైవ్‌ను టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం చేపడుతున్నారు.2024, 2025 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ డ్రైవ్‌కు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు ఉదయం 9 గంటలకు ‘టాస్క్’ కార్యాలయానికి తమ పత్రాలతో హాజరుకావాలని ప్రతినిధులు సూచించారు.

Nov 12
జమ్మికుంట రైతు ప్రగతి రెండవ వార్షిక సమావేశం

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం రెండవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. రైతు ప్రగతి చైర్మన్ సంద మహేందర్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న GNNS-KVK ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయ్ గోపాల్ రెడ్డి FPO అవకాశాలపై మాట్లాడారు. స్మార్ట్ కార్డుల ద్వారా రైతులకు ఇన్పుట్ అందించాలని, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభాలు పొందాలని సూచించారు. హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ, రైతులు ఇన్పుట్ […]

Nov 12
జమ్మికుంటలో లక్ష దీపోత్సవ మహోత్సవం

నవంబర్ 17న వైభవంగా కార్తీక దీపోత్సవం జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 17, 2025 సోమవారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా శివరామకృష్ణ ఆశ్రమ బృందం, అంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీకృష్ణ అకాడమీచే కూచిపూడి నాట్యం, చక్కభజనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ ప్రచారకులు స్వామి లక్షణాచార్య ప్రవచనం, పురోహితులచే […]

Nov 12
పి.ఆర్.సి. వెంటనే ప్రకటించాలి: టి.పి.టి.ఎఫ్. డిమాండ్

జమ్మికుంట: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.ఎఫ్) సీనియర్ నాయకులు కోల రాజమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను సేకరించారు.పెండింగ్‌లో ఉన్న ఐదు డి.ఏ.లు, నాణ్యమైన పి.ఆర్.సి.ని వెంటనే ప్రకటించాలని ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జి.పి.ఎఫ్., సరెండర్ లీవ్స్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు అంకితం చేసే విధంగా విధానాలు ఉండాలని, పర్యవేక్షణ పేరుతో ఒత్తిడి పెంచవద్దని […]

Nov 12
సామాజిక స్పృహ చాటిన విద్యుత్ ఉద్యోగులు

జమ్మికుంట: జమ్మికుంట-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై నాగంపేట కూడలి వద్ద ఏర్పడిన గుంతను తనుగుల సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు పూడ్చి సామాజిక స్పృహ చాటుకున్నారు. వర్షాలకు ఏర్పడిన ఈ పెద్ద గుంతతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. బేకరీ యజమాని రవి విజ్ఞప్తి మేరకు, బిజిగిరి షరీఫ్ లైన్ మెన్ విజ్జిగిరి అంజయ్య, ఏఎల్ఎం రమేష్ బాబు, సతీష్ సహా ఇతర ఉద్యోగులు లంచ్ సమయంలో కంకర, సిమెంట్‌తో గుంతను పూడ్చివేశారు. వీరి సేవను స్థానికులు, వాహనదారులు హర్షించారు.

Nov 12
గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్‌ల పంపిణీ

టేకుర్తి: తెలంగాణ మోడల్ స్కూల్ టేకుర్తిలో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్, SSC మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 మందికి పరీక్షా ప్యాడ్‌లను పంపిణీ చేశారు.పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్ తన తల్లి మధురమ్మ పేరుమీద ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పి. తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ పంపిణీకి ఉపాధ్యాయులు అప్పల అశోక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కార్యక్రమంలో […]

Nov 12
అందెశ్రీ అస్తమయం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు

జమ్మికుంట: తెలంగాణ సాహిత్య కిరణం అందెశ్రీ అస్తమయం తెలంగాణ ప్రముఖ కవి, పద్మశ్రీ అందె శ్రీ ఆకస్మిక మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం కోట్లాది ప్రజల గొంతుకగా నిలిచింది. “మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు” లాంటి గేయాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జాగృతం చేయడంలో చిరస్మరణీయ పాత్ర పోషించాయి. గొప్ప కళాకారుడిని కోల్పోవడం విషాదకరం.ఈ సందర్భంగా, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ నేత తమ ప్రగాఢ […]

Listings News Offers Jobs Contact