జమ్మికుంట: మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ‘బీసీల హక్కులు బీసీలకు దక్కాలి’ అనే నినాదంతో ఈ నెల 19న (బుధవారం) దినేష్ కన్వెన్షన్, జమ్మికుంటలో చైతన్య సదస్సు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ హక్కులను సాధించుకోవడంపై బీసీ సమాజం సంఘటితం కావాలని సదస్సు కోరింది.విద్య, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై […]
జమ్మికుంట: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్తరా నక్షత్ర లక్ష్మీ గణపతి హోమం తో పాటు, స్వామివారికి నవవిధ అభిషేకములు, రుద్రాభిషేకం జరిగాయి.అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి, అఖండ హారతి ఇచ్చారు. ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. వారికి బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ మాల మంత్రాలతో దీక్షను […]
జమ్మికుంట: బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి 243 స్థానాలకు గాను సుమారు 206 సీట్లలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం అనంతరం కొలకాని రాజు మాట్లాడుతూ, దొంగ ఓట్లంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని బీహార్ ప్రజలు ఓటుతో తిరస్కరించడం చెంపపెట్టు అని ఎద్దేవా […]
జమ్మికుంట: జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులు చిన్న ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో పాఠాలు బోధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అలరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మండల విద్యా అధికారి హేమలత గారు ఉపాధ్యాయులుగా […]
ఇల్లందకుంట: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా, ఇల్లందకుంట మండలంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.హుజూరాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకొని, బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యూహం, సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, […]
హైదరాబాద్: మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను నూర్ భాషా (A, B, E) గ్రూపుల తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ యూసఫ్ శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. అఫ్జల్‌గంజ్‌లోని సెంట్రల్ లైబ్రరీ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి దృష్టికి, నూర్ భాషా కులస్తులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను యూసఫ్ తీసుకెళ్లారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ […]
జమ్మికుంట: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హుజురాబాద్, జమ్మికుంట శాఖలు సంయుక్తంగా ఒక 2K రన్ అవగాహన ర్యాలీని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చనే సందేశాన్ని ఈ ర్యాలీ ద్వారా విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
జమ్మికుంట: తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీల ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సదయ్య ధీమా వ్యక్తం చేశారు.
ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి.నాయకులు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం, పురోభివృద్ధిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు, రచయిత మరియు రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగానే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నెహ్రూ ఆశయాల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ […]
జమ్మికుంట: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ, సౌండ్ బాక్సుల నడుమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పార్టీ పెద్దలందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూసే ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించారని, రానున్న స్థానిక […]