Category: News

Nov 23
స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం డిజిటల్ అస్త్రం!

స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి. అభ్యర్థులకు విజయం సాధించేందుకు డిజిటల్ ప్రచారం కీలకంగా మారుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవడానికి, మీ సందేశాన్ని ప్రభావవంతంగా అందించడానికి డిజిటల్ వ్యూహాలు సహాయపడతాయి. జమ్మికుంట ప్రాంతంలో డిజిటల్ ప్రచార వివరాలు మరియు సహాయం కోసం ఐకాన్ కంప్యూటర్స్, జమ్మికుంటను సంప్రదించండి. మరిన్ని వివరాలకు 9154545254 కు కాల్ చేయండి.

Nov 23
జమ్మికుంట మండల సర్పంచ్ ల రిజర్వేషన్ల జాబితా విడుదల – భారీ మార్పులు

జమ్మికుంట: మండలంలో రాబోయే 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ రిజర్వేషన్ల ప్రతిపాదిత జాబితాను అధికారులు విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మొత్తం 20 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రిజర్వేషన్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.ముఖ్య అంశాలు:ఎస్సీ (SC) రిజర్వేషన్లు: నగురం, నాగంపేట, మాచన్నపల్లి గ్రామాలను ఎస్సీ (జనరల్/మహిళ) కు కేటాయించగా; శంభునిపల్లి, మడిపల్లి గ్రామాలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. బీసీ (BC) రిజర్వేషన్లు: పాపయ్యపల్లి, […]

Nov 23
ఫిబ్రవరి 2026 కోటా మరియు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల వివరాలు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, గదుల కోటా మరియు వైకుంఠ ద్వార దర్శన వివరాలను టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నవంబర్ నెలలో మిగిలిన ముఖ్యమైన విడుదల తేదీల పట్టిక కింద ఇవ్వబడింది. గమనిక: వైకుంఠ ద్వార దర్శనం (డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు) కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 27న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2న లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.

Nov 22
లేబర్ కోడ్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి: సీఐటీయూ

జమ్మికుంట, నవంబర్ 22: కార్మిక హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్ ల అమలు నోటిఫికేషన్ ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. శనివారం జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల అనంతరం కార్మికులపై భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని […]

Nov 21
అంతర్జాతీయ స్వర్ణ పతక విజేత రఘుకు రేపు జమ్మికుంటలో సన్మానం

జమ్మికుంట, నవంబర్ 21: భూటాన్లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్ హ్యామర్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘును శనివారం (నవంబర్ 22) ఉదయం 7 గంటలకు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా సన్మానించనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం చెల్పూర్ గ్రామానికి చెందిన రఘు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్రీడాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ […]

Nov 20
జమ్మికుంట మార్కెట్ ధరలు, రేపు సెలవు

జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ బుధవారం నాడు పత్తి ధరలు. 351 క్వింటాళ్ల విడి పత్తి మార్కెట్‌కు రాగా, దాని గరిష్ట ధర క్వింటాలుకు ₹7,090, కనిష్ట ధర ₹6,000 గా ఉంది. కాటన్ బ్యాగ్‌ల గరిష్ట ధర ₹6,600. నవంబర్ 20, గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. తిరిగి నవంబర్ 21, శుక్రవారం మార్కెట్ తెరుచుకోనుంది.

Nov 19
విస్డం కళాశాలలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం

జమ్మికుంట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక విస్డం జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అధ్యాపకులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా రావుల శరణ్య ప్రిన్సిపాల్‌గా, బొడ్డుపల్లి సందీప్ కుమార్ కరస్పాండెంట్ గా, కొత్తూరు సోనీ వైస్ ప్రిన్సిపాల్ గా, కుర్ర సిద్దు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ కే విజయేందర్ రెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు […]

Nov 19
జమ్మికుంటలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి […]

Nov 19
దేశ ప్రగతికి బాటలు వేసిన ఇందిరా: ఇల్లందకుంటలో ఘనంగా జయంతి వేడుకలు

ఇల్లందకుంట: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలు అని నాయకులు కొనియాడారు. రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, బంగ్లాదేశ్ విమోచన వంటి సంస్కరణలతో ఆమె ప్రజాదరణ పొందారు. ఆమె జీవితం నేటి […]

Nov 19
వాట్సాప్‌లో మీ-సేవ సేవలు ప్రారంభం! ఇకపై ఎస్‌ఎస్‌సి, ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సప్ లో

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పౌరులకు కీలకమైన మీ-సేవ సేవలను వాట్సాప్‌లో ప్రారంభించారు. మెటా భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఇతర పోటీ పరీక్షల హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.ఈ సేవ 24 గంటలు 8096958096 నంబర్‌పై అందుబాటులో ఉంటుంది. […]

Listings News Offers Jobs Contact