జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం రెండవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. రైతు ప్రగతి చైర్మన్ సంద మహేందర్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న GNNS-KVK ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయ్ గోపాల్ రెడ్డి FPO అవకాశాలపై మాట్లాడారు. స్మార్ట్ కార్డుల ద్వారా రైతులకు ఇన్పుట్ అందించాలని, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభాలు పొందాలని సూచించారు. హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ, రైతులు ఇన్పుట్ […]
టేకుర్తి: తెలంగాణ మోడల్ స్కూల్ టేకుర్తిలో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్, SSC మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 మందికి పరీక్షా ప్యాడ్‌లను పంపిణీ చేశారు.పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్ తన తల్లి మధురమ్మ పేరుమీద ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పి. తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ పంపిణీకి ఉపాధ్యాయులు అప్పల అశోక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కార్యక్రమంలో […]
జమ్మికుంట: వరల్డ్ డయాబెటిస్ డే (ప్రపంచ మధుమేహ దినోత్సవం) సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో ఈ నెల 14న జమ్మికుంటలో 2కే రన్ నిర్వహించనున్నారు.డయాబెటిస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. * ఎప్పుడు: నవంబర్ 14న * ఎక్కడ: జమ్మికుంట * రన్ మార్గం: అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ కళాశాల మైదానం వరకు ఈ 2కే రన్ కొనసాగుతుంది. ఈ […]
జమ్మికుంట: మంగళవారం, 11 నవంబర్, 2025 న న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షుడిగా పాస్టర్ జాన్, ఉపాధ్యక్షుడిగా డేవిడ్ పాస్టర్ ఎన్నికయ్యారు. పాస్టర్ జ్యోతి బాబు జనరల్ సెక్రటరీగా, పాస్టర్ సువార్త రాజు జాయింట్ సెక్రటరీగా, పాస్టర్ టైటస్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.పాస్టర్ అశోక్ గౌరవ అధ్యక్షులుగా, పాస్టర్ ప్రసాద్ ముఖ్య సలహాదారులుగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సైఫెన్, పాస్టర్ రాజేందర్ ఎన్నికయ్యారు.
జమ్మికుంట: ప్రసిద్ధ వాగ్గేయకారుడు, లోక కవి అందెశ్రీ అంతిమయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని నివాళులు అర్పించారు. అందెశ్రీ మరణం కళా, సాహిత్య రంగాలకు తీరని లోటు అని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిన అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, జనజాగృతి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కెర […]
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలను మంగళవారం జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దేశిని కోటి మాట్లాడుతూ, యువ నాయకుడైన దొంత రమేష్ ఎంతో మంది పేదలకు సహాయం చేశారని, రానున్న రోజుల్లో ఆయనకు మంచి ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
నవంబర్ 05, 2025జమ్మికుంట: ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి బస్తాలు కింద పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తక్షణమే స్పందించి సిబ్బందిని పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సతీష్ స్వయంగా వడ్ల బస్తాలను మోసి ట్రాక్టర్‌పై ఎక్కించి రైతుకు సహాయం చేశారు. ఆపదలో ఆదుకున్న పోలీసుల సేవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఖాజీపేట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు)కు సామాజిక సేవా రంగంలో తమిళనాడులోని ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా ‘నిత్య జనగణమన’ రూపకర్త, ఖాజిపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ప్రభును శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పింగళి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభాకర్ నిస్వార్థంగా దశాబ్ద కాలంగా సమాజ సేవ చేస్తున్నాడని, ఆయన ‘కైండ్ హార్టెడ్ పర్సన్’ అని అభివర్ణించారు. సీనియర్ జర్నలిస్టులు యం.డి […]
జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) అందుకున్నారు. శనివారం తమిళనాడులోని హోసూర్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి తమిళనాడు, కర్ణాటక యూనివర్సిటీ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. […]