కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించనుంది. ఈ ఉద్యోగ మేళా డిసెంబర్ 27, 2025న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా జాబ్ ఫెయిర్ శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్ రోడ్, చింతకుంట, కరీంనగర్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వీటి ద్వారా 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగ […]
జమ్మికుంట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక విస్డం జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అధ్యాపకులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా రావుల శరణ్య ప్రిన్సిపాల్‌గా, బొడ్డుపల్లి సందీప్ కుమార్ కరస్పాండెంట్ గా, కొత్తూరు సోనీ వైస్ ప్రిన్సిపాల్ గా, కుర్ర సిద్దు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ కే విజయేందర్ రెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు […]
జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, జమ్మికుంటలో ఖాళీగా ఉన్న M.Sc. జువాలజీ మరియు M.Sc. బోటనీ కోర్సుల్లో ప్రవేశం కోసం స్పాట్ అడ్మీషన్లు నిర్వహించనున్నారు.ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుదారులు CPGET – 2025లో అర్హత పొంది ఉండాలి లేదా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి […]
జమ్మికుంట: హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ శనివారం జమ్మికుంట మండలంలోని 8 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేసింది.ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 227 మందికి, ఇంటర్మీడియట్ చదువుతున్న 160 మందికి కలిపి మొత్తం 387 పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జరిగింది. ఈ […]
జమ్మికుంట: జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులు చిన్న ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో పాఠాలు బోధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అలరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మండల విద్యా అధికారి హేమలత గారు ఉపాధ్యాయులుగా […]
జమ్మికుంట, నవంబర్ 13, 2025: చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని PSK ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొనగంటి సాత్విక్ పటేల్ పిలుపునిచ్చారు. పొనగంటి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం మండల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట టౌన్ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు […]
జమ్మికుంట: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.ఎఫ్) సీనియర్ నాయకులు కోల రాజమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను సేకరించారు.పెండింగ్‌లో ఉన్న ఐదు డి.ఏ.లు, నాణ్యమైన పి.ఆర్.సి.ని వెంటనే ప్రకటించాలని ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జి.పి.ఎఫ్., సరెండర్ లీవ్స్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు అంకితం చేసే విధంగా విధానాలు ఉండాలని, పర్యవేక్షణ పేరుతో ఒత్తిడి పెంచవద్దని […]
జమ్మికుంట మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.జమ్మికుంట బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గురుకుల పాఠశాలలకు, శిథిలావస్థలో […]
జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద […]
జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: ఆల్ ఇండియా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (AISJAC) వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర సంజయ్ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ పేద విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని కొనియాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల అన్యాయాలను అరికట్టడానికి, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు లేకుండా ప్రతి […]