Category: Devotional

Nov 23
ఫిబ్రవరి 2026 కోటా మరియు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల వివరాలు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, గదుల కోటా మరియు వైకుంఠ ద్వార దర్శన వివరాలను టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నవంబర్ నెలలో మిగిలిన ముఖ్యమైన విడుదల తేదీల పట్టిక కింద ఇవ్వబడింది. గమనిక: వైకుంఠ ద్వార దర్శనం (డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు) కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 27న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2న లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.

Nov 15
అయ్యప్ప ఆలయంలో ఉత్తరా నక్షత్ర పూజ, దీక్ష స్వీకరణ

జమ్మికుంట: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్తరా నక్షత్ర లక్ష్మీ గణపతి హోమం తో పాటు, స్వామివారికి నవవిధ అభిషేకములు, రుద్రాభిషేకం జరిగాయి.అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి, అఖండ హారతి ఇచ్చారు. ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. వారికి బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ మాల మంత్రాలతో దీక్షను […]

Nov 12
జమ్మికుంటలో లక్ష దీపోత్సవ మహోత్సవం

నవంబర్ 17న వైభవంగా కార్తీక దీపోత్సవం జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 17, 2025 సోమవారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా శివరామకృష్ణ ఆశ్రమ బృందం, అంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీకృష్ణ అకాడమీచే కూచిపూడి నాట్యం, చక్కభజనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ ప్రచారకులు స్వామి లక్షణాచార్య ప్రవచనం, పురోహితులచే […]

Nov 05
జమ్మికుంట బొమ్మల గుడిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

నవంబర్ 05, 2025జమ్మికుంట: కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) ఆలయం భక్త సంద్రమైంది. భక్తులు స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ఉసిరి చెట్టుకు దీపాలు సమర్పించారు. అమ్మవారికి పౌర్ణమి పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా, అన్నపూర్ణ సేవా సమితి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.

Oct 29
జమ్మికుంట అయ్యప్ప దేవాలయంలో వైభవంగా హోమం!

జమ్మికుంట: స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా ఈరోజు హోమం మరియు స్వామివారికి విశేషాలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ శ్రీధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప సేవ సమితి ఆకాంక్షించింది.

Oct 28
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట: కరపత్రం ఆవిష్కరణ!

జమ్మికుంట (అక్టోబర్ 28, 2025): జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు జరిగే మంత్రశిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళవారం ఆవిష్కరించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి పీఠాధిపతులు రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ […]

Oct 28
భక్తులకు అలర్ట్: డిసెంబర్ శ్రీవారి సేవ టికెట్లు అక్టోబర్ 30న విడుదల

జమ్మికుంట (అక్టోబర్ 28): తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటాను అక్టోబర్ 30వ తేదీన విడుదల చేయనుంది. భక్తులు స్వచ్ఛంద సేవలో పాల్గొనేందుకు ఇది సువర్ణావకాశం.బుకింగ్ వివరాలు:

Oct 24
జమ్మికుంట అయ్యప్ప దేవాలయంలో 25న లక్ష్మీ గణపతి హోమం

జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా రేపు (25-10-2025) శనివారం ఉదయం 7 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో సకాలంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరనీ అయ్యప్ప సేవా సమితి, జమ్మికుంట వారు ఒక ప్రకటనలో తెలిపారు.

Listings News Offers Jobs Contact