కరీంనగర్ జిల్లా (అక్టోబర్ 18, 2025): కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అభిప్రాయ సేకరణహుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కరీంనగర్లో ఏఐసీసీ పరిశీలకులు మానే శ్రీనివాస్, పీసీసీ ప్రతినిధులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను మర్యాదపూర్వకంగా కలిశారు.కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ ప్రతినిధులు కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. జిల్లా […]
2025 అక్టోబర్ 18కరీంనగర్ జిల్లా, జమ్మికుంట: లెదర్ పార్కులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డి) జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.జమ్మికుంట గాంధీ చౌరస్తాలో లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 11 సంవత్సరాల క్రితం చర్మకారుల అభివృద్ధి కోసం ఉమ్మడి […]
జమ్మికుంట, అక్టోబర్ 18 (జమ్మికుంటలోకల్.కామ్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, బీసీలను మోసం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం సిగ్గుచేటని అన్నారు.42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కులగూడెం చౌరస్తా నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ […]
2025 అక్టోబర్ 18ఇల్లందకుంట: బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ జరిగింది. ఈ బంద్‌లో బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఆర్‌పిఎస్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, గుండ్ల గణపతి, తిరుమల మాట్లాడుతూ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. […]
17 అక్టోబర్ 2025బీసీల ఉద్యమాలన్నింటికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది: సింగిల్ విండో చైర్మన్కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, మాజీ ఎంపీటీసీ తోట లక్ష్మణ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా జరుగుతున్న కుట్రలకు నిరసనగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు (18) జరగబోయే తెలంగాణ బంద్‌ను పాటించాలని వారు […]
October 16, 2025జమ్మికుంట: పట్టణంలోని 22వ వార్డు అంబేడ్కర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుల్లి ప్రతాప్ ఆధ్వర్యంలో మల్లయ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతాప్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనసున్న పొనగంటి మల్లయ్య నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మల్లయ్యను శాలువాతో సన్మానించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యూత్ సభ్యులు ఇల్లందుల శ్రీనివాస్, శశి కుమార్, రవిబాబు, రాజు, […]
16 అక్టోబర్ 2025జమ్మికుంట: ఈనాడు పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రతిభ పాటవ’ చిత్రలేఖన పోటీల్లో జమ్మికుంటలోని విద్యోదయ పాఠశాల (VIDYODAYA SCHOOLS) విద్యార్థులు తమ ప్రతిభను చాటి బహుమతులు గెలుచుకున్నారు.పిల్లలకు ఇష్టమైన పండుగల అంశంపై నిర్వహించిన ఈ చిత్రలేఖన పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో పలువురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు.పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ యేభూషి ఆర్యన్ కౌశిక్ బహుమతులను ప్రదానం […]
16 అక్టోబర్ 2025జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ ఇమ్రాన్ ఆదేశాల మేరకు, జమ్మికుంటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీపీఆర్ (CPR) మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని 108 ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఐలావెని కుమారస్వామి, అమిరిశెట్టి బద్రీనాథ్, మరియు పైలెట్లు సిహెచ్. సంపత్ రెడ్డి, బి. రమేష్ నిర్వహించారు. విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించే విధానం, ముఖ్యంగా సీపీఆర్ పద్ధతిని […]
తేదీ 15-10-2025జమ్మికుంట:జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ నేతృత్వంలో పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.వివరాల్లోకి వెళితే, జమ్మికుంట గ్రామానికి చెందిన లకిడి వీణ రాణి (భర్త విజయ్) తన వివో మొబైల్ ఫోన్‌ను జమ్మికుంటలో పోగొట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ కేసును స్వీకరించారు.ఐఎంఈఐ (IMEI) నంబర్ ఆధారంగా సి.ఇ.ఐ.ఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోలీసులు గాలింపు చేపట్టారు. పోగొట్టుకున్న మొబైల్‌ను […]
కరీంనగర్, అక్టోబరు 15, 2025:కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గూడెపు సారంగపాణి తన దరఖాస్తును ఏఐసీసీ అబ్జర్వర్స్‌కు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్జర్వర్స్‌ను కలిసిన సారంగపాణి, పార్టీ బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని వారికి వివరించారు.ఈ సందర్భంగా గూడెపు సారంగపాణి మాట్లాడుతూ.. తాను 33 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని తెలిపారు. హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఎన్ఎస్‌యూఐ విద్యార్థి ప్రెసిడెంట్‌గా, […]