News

Oct 30
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు డిమాండ్

భారీ వర్షాలు: రైతుల పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ కరువైంది! – ఎర్రబెల్లి సంపత్ రావు జమ్మికుంట: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు.వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు పెట్టుబడులు పెట్టి, అవి చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాలు పడటం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ […]

Oct 29
జమ్మికుంట అయ్యప్ప దేవాలయంలో వైభవంగా హోమం!

జమ్మికుంట: స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా ఈరోజు హోమం మరియు స్వామివారికి విశేషాలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ శ్రీధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప సేవ సమితి ఆకాంక్షించింది.

Oct 28
హరీష్ రావు తండ్రికి జమ్మికుంట బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి

సత్యనారాయణ రావుకు ప్రముఖుల నివాళిమాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి కీ.శే. తన్నీరు సత్యనారాయణ రావు ఉదయం మరణించారు. హైదరాబాద్‌లో వారి అంతిమయాత్రలో జమ్మికుంట ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, బీఆర్ఎస్ […]

Oct 28
సమస్యలపై సానుకూల స్పందన: బండి సంజయ్‌ను సన్మానించిన పాపయ్యపల్లి గ్రామస్థులు

జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ ప్రజలు, నాయకులు పలు సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి సానుకూలంగా హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, రాములు, రాకేష్, రాజు, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.

Oct 28
జమ్మికుంట పత్తి మార్కెట్ ఈ రోజు ధరలు

జమ్మికుంట, మార్కెట్ కమిటీ (28/10/2025, మంగళవారం): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఇలా ఉన్నాయి. * కాటన్ విడి పత్తి: క్వింటాల్ సగటు ధర ₹7,000 నుండి కనిష్టంగా ₹6,000 వరకు పలికింది. 1140 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. * కాటన్ బ్యాగ్స్ (బస్తాలు): క్వింటాల్ ధర ₹6,500 నుండి కనిష్టంగా ₹5,400 వరకు ఉంది. 34 క్వింటాళ్లు మార్కెట్‌కు చేరింది.మార్కెట్‌కు మొత్తం 115 వాహనాల్లో పత్తి వచ్చింది.

Oct 28
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట: కరపత్రం ఆవిష్కరణ!

జమ్మికుంట (అక్టోబర్ 28, 2025): జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు జరిగే మంత్రశిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళవారం ఆవిష్కరించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి పీఠాధిపతులు రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ […]

Oct 28
పరామర్శ: కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన YuppTV CEO!

వీణవంక (అక్టోబర్ 28, 2025): మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, YuppTV & Turito వ్యవస్థాపక, CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంకలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి తిరుపతిరెడ్డి, మేకల సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, తాళ్లపెల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, సిరిగిరి రాజశేఖర్, పస్తం కుమార్ స్వామి, దాసరపు […]

Oct 28
భక్తులకు అలర్ట్: డిసెంబర్ శ్రీవారి సేవ టికెట్లు అక్టోబర్ 30న విడుదల

జమ్మికుంట (అక్టోబర్ 28): తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటాను అక్టోబర్ 30వ తేదీన విడుదల చేయనుంది. భక్తులు స్వచ్ఛంద సేవలో పాల్గొనేందుకు ఇది సువర్ణావకాశం.బుకింగ్ వివరాలు:

Oct 27
ఫీజు బకాయిలపై భగ్గుమన్న BRSV: హలో విద్యార్థి చలో కలెక్టరేట్ – కార్యక్రమం

జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, జమ్మికుంట మండల అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో ‘హలో విద్యార్థి చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులతో BRSV నాయకులు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారిందని నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ […]

Oct 27
సేవలకు అరుదైన గౌరవం: జమ్మికుంట వాసి అంబాల ప్రభాకర్‌కు గౌరవ డాక్టరేట్!

జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) అందుకున్నారు. శనివారం తమిళనాడులోని హోసూర్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి తమిళనాడు, కర్ణాటక యూనివర్సిటీ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. […]

Listings News Offers Jobs Contact