వావిలాల: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ వరుణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో 43 మంది వృద్ధులకు రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మాట్లాడుతూ, వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నడక, ధ్యానం, ఉదయపు ఎండలో గడపడం వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. […]
వావిలాల అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక సభ జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు. తల్లిదండ్రులకు చక్కెర, నూనె, ఉప్పు వాడకంపై, అలాగే పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి రక్ష అని, కుటుంబంలో వారి పాత్ర ముఖ్యమని వక్తలు తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, […]
వావిలాల గ్రామంలో తల్లి దుర్గామాతను దర్శించుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం. వేలంపాటలో గెలుపొందిన భక్తులకు వస్త్రాలు అందించారు. తదనంతరం దుర్గామాత కమిటీ సభ్యులు చైర్ పర్సన్ కు అమ్మవారి శాలువ కప్పి ఆశీర్వదించారు. ఈ అవకాశం కల్పించిన దుర్గామాత కమిటీ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.