ఇల్లందకుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్‌తో కరీంనగర్ జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా నిరసన చేసే అవకాశం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఇల్లంతకుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి జంపాల రితీష్ సహా ఉపాధ్యక్షులు తోడేటి మధుకర్ గౌడ్, కారింగుల రాజేందర్, కోశాధికారి చింతల కౌశిక్, మురహరి రాజు, మేకల తిరుపతి, నల్లగొండ రాజు, […]
జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం దూదేకుల, నూర్ భాష మరియు ఫకీర్ కులాలకు మొపేడ్ వాహనాలు (ఎలక్ట్రిక్ టూ వీలర్లు), వితంతు/ఒంటరి మహిళలకు రూ.50,000/- అందించే పథకాలను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసింది. ఈ పథకాలకు చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. ఎన్నికలు వాయిదా పడినందున, దరఖాస్తు గడువును తిరిగి పొడిగించాలని మైనారిటీ సీనియర్ నాయకులు ఎం.డి గౌసోద్దీన్, ఎం.డి అంకూషా, యాకుబ్, సలీం తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకాలు పేద మైనారిటీల జీవనోపాధికి కీలకం.