జమ్మికుంట: మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవంబర్ 10, సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన 26 మంది విద్యార్థులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎమ్మార్వో, స్థానిక ఎంఈఓలతో కలిసి విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన లోపాలను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, […]