Tag: Sree Seethaarama Chandra Swamy

Mar 24
మున్సిపల్ చైర్మన్‌కు ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల ఆహ్వానం

మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Mar 24
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు ఇల్లందకుంట శ్రీ సీతారామ కల్యాణ ఆహ్వానం

మార్చి 24: ఈ నెల 27న జరగనున్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

Listings News Offers Jobs Contact