10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నిత్య జనగణమన కార్యక్రమం జమ్మికుంట, ఆగస్టు 14: దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జమ్మికుంట నిత్య జనగణమన కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది. పట్టణ ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించే ఈ ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15వ తేదీతో 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. గత తొమ్మిదేళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం జమ్మికుంటకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జాతీయ గీతం […]
జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]