నవంబర్ 05, 2025జమ్మికుంట: ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి బస్తాలు కింద పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తక్షణమే స్పందించి సిబ్బందిని పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సతీష్ స్వయంగా వడ్ల బస్తాలను మోసి ట్రాక్టర్‌పై ఎక్కించి రైతుకు సహాయం చేశారు. ఆపదలో ఆదుకున్న పోలీసుల సేవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
జమ్మికుంట: అక్టోబరు 13, 2025 న విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి రమేష్ (తండ్రి: సాయిలు) జమ్మికుంటలో పోగొట్టుకున్న ఒప్పో మొబైల్‌ను పోలీసులు తిరిగి అందించారు.టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో, మొబైల్‌ను ఐఎంఈఐ నంబర్ ద్వారా సీఈఐఆర్ పోర్టల్ (CEIR PORTAL) సహాయంతో గుర్తించారు. మొబైల్ పోగొట్టుకున్నవారు వెంటనే ఈ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఇన్స్పెక్టర్ రామకృష్ణ సూచించారు.