జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘంలో 72వ సహకార సంఘాల వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుండి 20 వరకు జరిగే ఈ వారోత్సవాలలో భాగంగా సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(అక్టోబర్ 12, 2025, జమ్మికుంట లోకల్)జమ్మికుంట: నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని జమ్మికుంట సింగిల్ విండో ఛైర్మన్ పొనగంటి సంపత్ తీవ్రంగా ఆరోపించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్ది కాలంలోనే కౌశిక్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని, నిస్వార్థంగా సేవలందిస్తూ నియోజకవర్గానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారని సంపత్ కొనియాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌ను “చీడ”లా పట్టిపీడిస్తున్నారని, ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు […]